Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా ముగ్గురు అక్కచెల్లెళ్లకు గాను చొక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21 లక్షల చెక్కను తండ్రి ఎల్లయ్య గౌడ్ కు ప్రభుత్వం తరుపున అధికారులు అందజేశారు.
నష్టపరిహారం అందుకుంటూ తండ్రి ఎల్లయ్య గౌడ్ తీవ్ర కంటతడి పెట్టాడు. నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది అంటూ ఉద్వేగభరితమయ్యారు. తన రెండో కూతురు జాబ్ చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేదని.. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు కలిసి తనకు జీతం పంపించారా? అంటూ తండ్రి రోదించడంతో అక్కడున్న వాళ్లు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
