Advertisement

మాజీ ప్రధాని దేవెగౌడను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

మన పత్రిక: మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఇటీవల దేవెగౌడ భార్య కన్నుమూయడంతో ఆయన తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దేవెగౌడకు ఫోన్ చేసి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

దేవెగౌడ కుటుంబంతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు. ఆ కుటుంబంతో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement