Telanagana Breakfast scheme: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం తమిళనాడులో అమలులో ఉన్న పథకంతో పోలి ఉంటుంది.
తమిళనాడులో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పాఠశాల పనిదినాల్లో ఉచిత అల్పాహారం అందిస్తున్నారు. దీన్ని 2022 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు.
ఈ పథకం వల్ల విద్యార్థుల హాజరు పెరిగింది. పోషకాహార స్థాయిలు కూడా మెరుగుపడ్డాయి. పిల్లల ఆరోగ్యం, విద్యా ప్రోత్సాహం, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడం దీని ప్రధాన లక్ష్యాలు. పథకం కింద 13 రకాల అల్పాహార వంటకాలను అందిస్తారు. ఉదాహరణకు, సోమవారం కూరగాయల సాంబార్‌తో రవ్వ ఉప్మా లేదా సేమియా ఉప్మా ఇస్తారు.
రేవంత్ రెడ్డి ఇటీవల చెన్నై పర్యటన సందర్భంగా ఈ పథకాన్ని పరిశీలించారు. తర్వాత తెలంగాణలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
