Advertisement

Tollywood : నన్నెవరూ కలుస్తలేరు.. సినిమాటోగ్రఫీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ పై గత కొంత కాలంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను బట్టి తెలుస్తుంది. ఆ మధ్య అల్లు అర్జున్ విషయం నుండి నిన్నటి ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా వరకు ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి సమస్య వస్తూనే ఉంది. అసలు విషయానికి వస్తే.. మొన్న రాజా సాబ్ (Rajasaab) రిలీజ్ సందర్బంగా అయిన రచ్చ గురించి తెలిసిందేగా. ప్రభాస్ “రాజాసాబ్” సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ లో నిర్మించి సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయగా, రిలీజ్ కి రెండు రోజుల ముందు, టికెట్స్ హైక్ కోసం మేకర్స్ మెమో పంపినా, రిలీజ్ కి ముందు రోజు రాత్రి వరకూ అప్రూవ్ చేయకుండా మేకర్స్ ని ఇబ్బంది పెట్టారు.

అయితే 12న వస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) “మన శంకర వరప్రసాద్ గారు” (MSVPG) సినిమాకి మాత్రం వెంటనే అప్రూవ్ చేసారు. దీని వెనకాల పాలిటిక్స్ బాగా జరుగుతుందని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే రెండు సినిమాలకు మెమోలు ఒకేసారి పంపినా, రాజా సాబ్ కి ఆలస్యం చేయడం, చిరంజీవి సినిమాకి వెంటనే పర్మిషన్ ఇవ్వడం రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి.

Advertisement

అయితే తాజాగా దీని గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి (Cinematography minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KomatReddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సినిమాల టికెట్ హైక్స్ పై జీవో ప్రస్తావన గురించి విలేఖరులు అడగగా, దానికి మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బదులిస్తూ… “నన్ను ఎవరు కలుస్తలేరు” అని “నేను సినిమా టికెట్ హైక్ ఇవ్వలేదు” అని అన్నారు. అలాగే తాను “సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశానని, సినిమా “టికెట్ ధరల పెంపు” (Ticket Hikes) గురించి వస్తున్న “జీవో” (GO) లకు తనకు ఎలాంటి సంబంధం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇక సోషల్ మీడియాలో మాత్రం సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోనపుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండి ఏం లాభం? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మా అసోసియేషన్ (MAA) గాని, చిత్ర నిర్మాతలుగాని దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement