టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోయే క్రేజీ సినిమాల్లో “మన శంకర వరప్రసాద్” (Mana shankara varaprasad) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నుండి తాజాగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నట్టు ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ విషయాన్నీ అఫిషియల్ గా కంఫర్మ్ చేస్తూ, తాజాగా వెంకటేష్ సెట్స్ లో అడుగుపెట్టిన విషయాన్ని తెలియచేస్తూ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్నీ నెట్టింట షేర్ చేశారు. మేకర్స్ కూడా ఈ విషయాన్నీ గ్రాండ్ గా ఓ వీడియోతో షేర్ చేసారు. ఈ వీడియోలో వెంకటేష్ షూటింగ్ సెట్స్‌కు రాగా ‘వెల్కమ్ వెంకీ.. మై బ్రదర్’ అంటూ చిరంజీవి ‘చిరు సార్.. మై బాస్’ అంటూ వెంకటేష్ ఒకరినొకరు పలకరించుకున్నారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర అత్యంత కీలకం కానుండగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

