Advertisement

తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివని సీఎం చంద్రబాబు ప్రశంస

మన పత్రిక: తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ప్రశంసించారు. విశాఖపట్నంలో ఒక రాపిడో డ్రైవర్ చూపించిన మానవత్వానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

విశాఖలో ఆకలితో ఇబ్బంది పడుతున్న ఒక యువకుడిని గమనించిన రాపిడో డ్రైవర్, అతనికి వెంటనే దోశ కొనిచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాజంలో ఇలాంటి మానవతా దృశ్యాలు నింపే స్పూర్తి గొప్పదని, సాటి మనుషుల పట్ల ప్రేమను చాటడంలో తెలుగు ప్రజల మనసు బంగారమని సీఎం చంద్రబాబు కొనియాడారు.

Advertisement
Advertisement