WhatsApp
Advertisement

Jammu Police Station Blast : జమ్మూకశ్మీర్ పోలీస్ స్టేషన్ పేలుడు వీడియో రిలీజ్

Jammu Police Station Blast : గత అర్థరాత్రి 11.30 సమయంలో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన 9 మంది పోలీసులు మరణించారు. ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు వల్ల శరీర భాగాలు కూడా ఎగిరి కింద పడ్డాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా కొన్ని పేలుడు పదార్థాలను పోలీసులు ఇటీవల పట్టుకున్నారు.

ఆ పేలుడు పదార్థాలను పోలీస్ స్టేషన్ కు తరలించి.. వాటిని టెస్ట్ చేసేందుకు శాంపిల్స్ సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటికి వచ్చింది.

Advertisement
Advertisement