Car Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. కారు అయినా, బస్సు అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ విధంగా వెళ్లినా ప్రమాదాలు మాత్రం రాకుండా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. అనంతరం ఇంజిన్ కు మంటలు అంటుకోవడంతో క్షణాల్లో కారు కాలి బూడిదైపోయింది. కారుకు మంటలు అంటుకోగానే కారులో ఉన్న 8 మంది ప్రయాణికులు వెంటనే బయటికి రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడం వల్లనే కారుకు మంటలు అంటుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
