మన పత్రిక, వెబ్‌డెస్క్: దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై (Burj Khalifa) పిడుగు పడిన అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన వీడియోను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (ఫజ్జా) స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ప్రస్తుతం యూఏఈలో ‘అల్ బషాయర్’ అల్పపీడనం (Low Pressure) కారణంగా వాతావరణం అస్థిరంగా ఉంది. పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశం నుంచి వచ్చిన భారీ పిడుగు 829.8 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా శిఖరాన్ని తాకింది. అయితే, భవనానికి ఉన్న అత్యాధునిక రక్షణ వ్యవస్థ (Lightning Protection System) కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రకృతి ప్రకోపానికి, ఆ దృశ్యానికి ఆశ్చర్యపోతున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
