Advertisement
btech student commits suicide in hanmakonda

BTech Student Suicide : కాలేజీలో చెప్పే పాఠాలు అర్థం కావట్లేదని యువతి ఆత్మహత్య

BTech Student Suicide : కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక ఏం చేయాలో తెలియని ఓ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కీర్తన హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది.

Advertisement

కానీ, కాలేజీలో లెక్చరర్స్ చెబుతున్న లెస్సన్స్ అర్థం కాక, తన కుటుంబ సభ్యులను వదిలి హైదరాబాద్ లో ఉండలేక డిప్రెషన్ కు గురైంది. తను కాలేజీలో ఉండలేకపోతున్నానని, చదువు ఏం అర్థం కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. వేరే కాలేజీలో చేరుతానని చెప్పింది. దీంతో తన తల్లిదండ్రులు కూడా సరే అన్నారు.

Advertisement

ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చిన కీర్తన గత శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement