మన పత్రిక, వెబ్‌డెస్క్
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఈ నెల 30న ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు BSNL అధికారికంగా ప్రకటించింది.
Advertisement
ఈ ఫ్రీడమ్ ప్లాన్ కింద కేవలం రూ.1కే ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. అంతేకాకుండా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై స్పీడ్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రత్యేకంగా యువత, విద్యార్థులు ఈ ప్లాన్ కు మెప్పు తెలుపుతున్నారు. BSNL సర్వీస్ పొందే ప్రాంతాల్లో ఉన్న వారు ఈ ప్లాన్ కోసం BSNL సెల్యులార్ ఆఫీస్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
