Advertisement

‘ఫౌజీ’ సెట్స్‌కు సెప్టెంబర్ 15 వరకు విరామం

సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం లభించింది. వరుస ప్రాజెక్టుల చిత్రీకరణలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సంబంధించి ఈ సినిమాలో ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఆయన వరుసగా షూటింగ్స్‌లో పాల్గొనడంతో సెప్టెంబర్ 15 వరకు ఈ చిత్ర చిత్రీకరణకు విరామం ఇచ్చినట్లు సమాచారం.

షూటింగ్‌లో విరామం వచ్చినప్పటికీ, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు భారీ యాక్షన్ బ్లాక్స్ కోసం పనిచేస్తున్నాయి.

Advertisement

Advertisement