మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘బ్రహ్మముడి’ రోజుకో మలుపు తిరుగుతోంది. జనవరి 9 (గురువారం) ఎపిసోడ్లో హైడ్రామా చోటుచేసుకుంది. రాజ్ అరెస్టుతో కంగారుపడిన కావ్యకు ఏడో నెలలోనే నొప్పులు రావడం, ఆస్పత్రిలో ఆమె కండిషన్ సీరియస్‌గా మారడంతో ఉత్కంఠ నెలకొంది.
రాజ్ వస్తేనే ఆపరేషన్.. రాజ్ అరెస్ట్ విషయం తెలిసి తట్టుకోలేకపోయిన కావ్యకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బీపీ కంట్రోల్ అయితే తప్ప ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే, “నా భర్తను చూస్తే గానీ నా టెన్షన్ తగ్గదు.. ఆయన వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా” అని కావ్య భీష్మించుకుని కూర్చుంది. మరోవైపు సెలవుల కారణంగా రాజ్‌కు బెయిల్ లభించలేదని సుభాష్ చెప్పడంతో కుటుంబం ఆందోళనలో పడింది.
రాహుల్‌పై అప్పు డౌట్.. స్వప్న రచ్చ ఇదే సమయంలో అప్పుకు రాహుల్‌పై అనుమానం వచ్చింది. రాజ్ కారులో దొరికిన బ్రీఫ్ కేసు, ఆ రోజు రాత్రి రాహుల్ ఇంటికి తెచ్చిన బ్రీఫ్ కేసు ఒకేలా ఉన్నాయని అప్పు నిలదీసింది. “ఆ రోజు అడిగితే తడబడ్డావ్.. ఇందులో ఏదో మర్మం ఉంది” అని రాహుల్‌ను ప్రశ్నించింది. దీంతో స్వప్న సీరియస్ అయ్యింది. “నీ పోలీస్ బుద్ధి నా మొగుడిపై చూపించకు.. పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలతాయి” అంటూ అప్పు, ధాన్యలక్ష్మిలపై స్వప్న విరుచుకుపడింది.
కావ్య మిస్సింగ్ ట్విస్ట్ కావ్య బీపీ తగ్గించడానికి, రాజ్ కేసు నుంచి బయటపడుతున్నాడని కల్యాణ్ అబద్ధం చెప్పాడు. దీంతో కావ్య కాస్త కుదుటపడింది. అయితే, బయట అపర్ణ వాళ్లతో కల్యాణ్ అసలు విషయం చెబుతుండగా కావ్య వినేసింది. సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం చూసేసరికి కావ్య ఆస్పత్రి బెడ్ మీద కనిపించదు. కావ్య మిస్సింగ్ అని డాక్టర్ చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది. అసలు కావ్య ఎక్కడికి వెళ్లింది? అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలియనుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
