మన పత్రిక: నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో జరిగిన ఈ ఎన్నికలో అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. దీంతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీకి దక్కింది.
గత రెండు రోజులుగా ఈ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎన్నిక జరగాల్సి ఉండగా, సభ్యుల మధ్య తలెత్తిన చిన్న వివాదం కారణంగా ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. చివరికి ఆదివారం ఎన్నిక నిర్వహించి ఫలితాలను ప్రకటించారు.ఈ పరిణామంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అధికారంలోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి :
- సీఆర్పీఎఫ్లో 9,195 ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు | CRPF Tradesman Recruitment 2026
- JR NTR : బన్నీ కి ఒకే.. మరి చరణ్ కి? అంటే అప్పట్లోదంతా అబద్దమా? లేక?
- Durandhar2 @1500+ : దురంధర్ సీక్వెల్ భారీ రికార్డు.. కానీ ఆ అసలైన రికార్డు సాధ్యం కాదా?
- [24]7.ai Walk-in Drive : బెంగళూరులో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు ఛాన్స్!
- Sagility Walk in Drive : సాజిలిటీ వాక్ ఇన్ డ్రైవ్.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. 3 LPA వరకు జీతం!
