Advertisement
bjp and bc leaders clash over photos in hyderabad

BJP and BC Leaders : బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య కొట్లాట

BJP and BC Leaders : బీజేపీ ఆఫీసులోనే బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య కొట్లాట కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఫోటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతలు కొట్టుకున్నారు. ఈనెల 18న రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కోరేందుకు ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు వెళ్లారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఫోటోలు దిగే విషయంలో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీజేపీ, బీసీ సంఘం నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కృష్ణయ్య, రాంచంద్రరావు వద్దని వారించినా కూడా వాళ్లు వినలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement