మన పత్రిక: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో ఈ వారాంతంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చరణ్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఈ నేపథ్యంలో ఒకే వారంలో ఇద్దరిని ఎలిమినేట్ చేసే దిశగా నిర్వాహకులు యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
మొదటి వారంలో చరణ్, చైత్ర ఎలిమినేట్ కాగా, వీరిద్దరిలో ఒకరికి మళ్లీ అవకాశం ఇచ్చేందుకు వీక్షకులకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ఆధారంగా చరణ్ తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు.
ప్రమాదంలో ఉన్న సభ్యులు ఎవరు?
ప్రస్తుతం సాగుతున్న ప్రచారం ప్రకారం కృష్ణుడు, సృష్టి ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. సృష్టి టాస్క్‌లలోనూ, హౌస్ చర్చల్లోనూ తక్కువగా భాగస్వామ్యం వహిస్తుండగా, రోహిత్‌తో జరిగిన తొలినాటి గొడవ తర్వాత కృష్ణుడికి స్క్రీన్ టైమ్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షిణికి కూడా తక్కువ ఓటింగ్ నమోదువుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఇటీవల జరిగిన వాదనలు, టాస్క్‌లలో ఆమె చురుగ్గా ఉండటం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ నిజమైతే కృష్ణుడు, సృష్టి హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం అధికారిక ఎలిమినేషన్ ప్రక్రియ మరియు ఓటింగ్ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
