బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత ఆట రసవత్తరంగా సాగుతుండగా, ఈ వారం నామినేషన్లలో అందరూ టాప్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉండడం వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్లో ఈ వారం నామినేషన్లలో తనూజ, భరణి, దివ్య, రాము రాథోడ్, సుమన్ శెట్టి మరియు డెమోన్ పవన్ లు ఉండగా, వీళ్ళలో తనూజ కే టాప్ లో ఓటింగ్స్ పడుతుండగా, ఈ వారం తాను సేఫ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే భరణి, పవన్ లకు కూడా ఓటింగ్స్ బాగానే వస్తున్నాయి. అయితే డేంజర్ జోన్ లో ఉన్నది రాము రాథోడ్(Ramu Rathod , దివ్య. అలాగే సుమన్ శెట్టి.
అయితే సుమన్ (Suman Shetty) కి ఓటింగ్స్ పడుతున్నా, ఆటలో పెద్దగా ఇంప్రూవ్ మెంట్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా కనిపిస్తుంది. లేదంటే బిగ్ బాస్ ఏదైనా టాస్కులు పెట్టి కూడా పంపేయొచ్చు. అలా కాకుండా ఓటింగ్ పరంగా అయితే దివ్య, రాము రాథోడ్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
