Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Bigg Boss 9 telugu ) ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగించింది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. అగ్ని పరీక్ష షో ద్వారా సామాన్యులు ఎంపికయ్యారు. సినీ సెలబ్రిటీలు కూడా ఖరారయ్యారు. నాగార్జున ( Akkineni Nagarjuna ) చెప్పిన రెండు హౌస్ల కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
అయితే రెండు హౌస్లు అంటే రెండు వేర్వేరు ఇళ్లు కాదు. ఒకే హౌస్ లో రెండు రకాల బెడ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి సెలబ్రిటీల కోసం, మరొకటి సామాన్యుల కోసం. ఈ రెండో బెడ్ రూమ్ నే రెండవ హౌస్ అని పిలుస్తున్నారు. సామాన్యులు మొదట అక్కడ ఉంటారు. సెలబ్రిటీలు ప్రధాన హౌస్ లో ఉంటారు. బిగ్ బాస్ టీం ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అనేలా టాస్కులు ప్లాన్ చేస్తోంది. కొన్ని టాస్కుల్లో సామాన్యులు సెలబ్రిటీలకు సేవలు చేయాల్సి రావచ్చు. ఇది సీజన్ కి పెద్ద ట్విస్ట్ గా మారనుంది.
ఇప్పటికే ఖరారైన సెలబ్రిటీలు: రీతూ చౌదరి, తనూజ గౌడ, సుమన్ శెట్టి, భరణి, సంజన గిల్రాని, ఆశా షైనీ, ఇమ్మానుయేల్, ముకేశ్ గౌడ, శ్రేష్టి వర్మ, డెబ్జానీ తదితరులు ఉన్నారు. పూర్తి జాబితా శనివారం విడుదల కానుంది. అగ్ని పరీక్ష నుండి సామాన్యులుగా దమ్ము శ్రీజా, మాస్క్ మ్యాన్ హరీష్, నాగ ప్రశాంత్, పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ లు హౌస్ లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
