Advertisement

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

మన పత్రిక: భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా అతిపెద్ద ధింసా నృత్యంతో ఘనస్వాగతం పలకాలని ఆదేశించారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement