మన పత్రిక: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను తమ రాజకీయ లబ్ధికి వేదికగా మార్చవద్దని TTD బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు Bhanu Prakash Reddy వైసీపీ నేతలను హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవహారాలను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుమల ఘాట్ రోడ్డులో చోరీకి గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని పోలీసులు 24 గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారని, ఆ వెంటనే దానిని పునఃప్రతిష్ఠించామని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. గత వైసీపీ పాలనలో పలు ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించిన ఆయన, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఆలయాల పరిపాలన పారదర్శకంగా సాగుతోందని చెప్పారు. TTD నిధుల మళ్లింపుపై మాట్లాడే ముందు ఆధారాలు చూపాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆలయ పాలనతో పాటు ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు సిద్ధమని, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు: నేతన్న భరోసాకు ఆమోదం
- జూలై 24న స్టాక్ మార్కెట్ సాధారణంగా పనిచేస్తుందని ప్రకటన
- తెలంగాణలో జులై 24న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు
- భూపాలపల్లిలో గుట్కా నిల్వలపై సీసీఎస్ దాడి, భారీగా సరుకు స్వాధీనం
