మన పత్రిక: దేశవ్యాప్తంగా 2026 అక్టోబర్ నెలలో పండుగలు, జాతీయ దినోత్సవాలు మరియు ప్రాంతీయ పర్వదినాల నేపథ్యంలో బ్యాంకులకు ఉండే సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ వెల్లడించింది. ఈ సెలవులు వివిధ రాష్ట్రాలు, నగరాలను బట్టి మారుతుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తప్పనిసరిగా సెలవు ఉంటుంది. వీటితో పాటు అక్టోబర్ నెలలో వచ్చే అన్ని ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాలలో బ్యాంకులు పనిచేయవు. స్థానిక పండుగలను బట్టి వివిధ నగరాల్లో సెలవులు అమలువుతాయి.
వివిధ నగరాల వారీగా అక్టోబర్ నెల సెలవుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్టోబర్ 10న మహాలయ అమావాస్య సందర్భంగా బెంగళూరు, కోల్కతా నగరాల్లో బ్యాంకులు మూసివుంటాయి. అక్టోబర్ 17న మహాసప్తమి పురస్కరించుకుని అగర్తలాలో సెలవు ఉంటుంది. అక్టోబర్ 19న దసరా, మహానవమి, ఆయుధ పూజ, దుర్గ పూజ సందర్భంగా చెన్నై, కోల్కతా, భువనేశ్వర్, గువహాటి, పాట్నా సహా పలు నగరాల్లో సెలవు ప్రకటించారు. అక్టోబర్ 20న దసరా, విజయదశమి, మహానవమి పర్వదినాల కారణంగా అనేక ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 21న విజయదశమి, దుర్గా పూజ సందర్భంగా బెంగళూరు, కొచ్చి, కోల్కతా, తిరువనంతపురం నగరాల్లో సెలవు ఉంటుంది. అక్టోబర్ 22 మరియు 23 తేదీల్లో గ్యాంగ్టక్లో దుర్గా పూజ, దసాయి పండుగల కోసం బ్యాంకులు మూసివేస్తారు. అక్టోబర్ 26న లక్ష్మీ పూజ, విలీన దినోత్సవం, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఎంపిక చేసిన నగరాల్లో సెలవు ఉంటుంది. అక్టోబర్ 29న కర్వా చౌత్ సందర్భంగా షిమ్లాలో, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ లావాదేవీల కోసం వినియోగదారులు ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
