Advertisement

ఛఠ్ పూజ సందర్భంగా రేపు ఆ నగరాల్లో బ్యాంకులు బంద్

ఛఠ్ పూజ పండుగను పురస్కరించుకుని నవంబర్ 16 సోమవారం నాడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం పాట్నా, రాంచీ నగరాల్లోని బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.

ఈ పండుగ సెలవు దేశమంతటా వర్తించదని, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని తెలుస్తోంది. ప్రత్యక్ష బ్యాంకు శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ యుపిఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఎటిఎం సేవలు వినియోగదారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.

Advertisement

నవంబరు నెలలో మరిన్ని బ్యాంక్ సెలవులు

నవంబర్ మాసంలో మిగిలిన రోజుల్లో కూడా కొన్ని ప్రాంతీయ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 20న ఇగాస్-బగ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్‌లో, నవంబర్ 23న సెంగ్ కుట్ స్నేమ్ సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు పనిచేయవు.

గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు నగరాల్లో సెలవు ఉంటుంది. నవంబర్ 27న కనకదాస జయంతికి బెంగళూరులో, అలాగే నవంబర్ 28న నాల్గో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి.

Advertisement