WhatsApp
Advertisement

Auto Driver : ఒకే ఆటోలో 23 మంది స్కూలు పిల్లలు.. సీజ్ చేసిన పోలీసులు

Auto Driver : ఒక్క ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు చెప్పండి. చిన్న ఆటో అయితే అతి కష్టం మీద ఐదుగురు, పెద్ద ఆటో అయితే 10 మంది వరకు ప్రయాణిస్తారు. కానీ.. ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటోలో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు.

నాగర్ కర్నూల్ పట్టణం కేంద్రంలో ఆటోలో 23 మంది పిల్లలకు తీసుకెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను అడ్డుకొని పిల్లలను దింపేసి ఆటోను సీజ్ చేశారు. పసి పిల్లల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని ఆటో డ్రైవర్లకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.  

Advertisement
Advertisement