TG TET Results 2026: టెట్ ఫలితాలు.. చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ టెట్ (TG TET) – 2026 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG TET-2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదల కానున్నాయి. ఈసారి పేపర్‌-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,670 మంది … Read more

Meta layoffs 2026: 1,000 మందిపై వేటు.. ఏఐ వైపే జుకర్‌బర్గ్ చూపు

మన పత్రిక వెబ్​డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) 2026లో తొలిసారిగా భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. సంస్థకు చెందిన ‘రియాలిటీ ల్యాబ్స్’ (Reality Labs) విభాగంలో సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది. ఈ విభాగంలో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 10 శాతం మంది ఉపాధి కోల్పోయినట్లయింది. మంగళవారం ఉదయం నుంచే ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందినట్లు బ్లూమ్‌బెర్గ్ … Read more

సిరిసిల్ల టీచర్స్ క్రికెట్ టోర్నీ.. విజేతగా కోనరావుపేట జట్టు

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: మండల విద్యాధికారి మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహించిన ‘టీచర్స్ ప్రీమీయర్ లీగ్’ (TPL) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు జట్లు తలపడగా, ఫైనల్ లో సిరిసిల్ల జట్టుపై గెలిచిన కోనరావుపేట టీమ్ విజేతగా నిలిచింది. సిరిసిల్ల జట్టు రన్నరప్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే విజేతలకు కప్ ను అందించి … Read more

Banglore Crime : కోరిక తీర్చలేదని మహిళా టెక్కీ మర్డర్..

softwere teche murderd in banglore

కోరిక తీర్చలేదని ఓ సాఫ్ట్వేర్ మహిళా టేకి ని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో బెంగళూర్ (Banglore) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila kushalappa) (34). బెంగుళూర్ లో రామ్మూర్తినగర ఠాణా పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల. అయితేఈనెల 3న … Read more

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.567 కోట్ల నిధులు విడుదల

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్‌ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు. నిధుల … Read more

Sankranthi Race : ఇక మిగిలింది ఈ రెండే.. డిసైడ్ చేసేది ఆడియన్సే..

Anaganaga okaraju, Narinari Nadumamurari movies in pongal race

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా (Sankranthi race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో సంబంధం లేకుండా, మరీ చిన్న సినిమాలు కాకుండా, స్టార్ హీరో నుండి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కలిపి ఏకంగా 5 పండక్కి ఒకేసారి రిలీజ్ కావడం చాలా అరుదనే చెప్పాలి. ఇక ఈ పొంగల్ రేస్ లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (Rajasaab) … Read more

MSVPG : తొలిరోజు అదరగొట్టిన ప్రసాద్ గారు… సెకండ్ బిగ్గెస్ట్…

Mana Shankara Vara Prasad Garu first day collections list

టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా, అందులో మూడు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara Varaprasad garu) ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆడియన్స్ ని మాంచి కామెడీ ఎంటర్టైనర్ గా నవ్విస్తుంది. ముఖ్యంగా పండగ సందర్బంగా ఫ్యామిలీ … Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తాజా జాబితా ప్రకారం.. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,43,023 మంది … Read more

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (GGH) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఓపీ, స్కానింగ్ విభాగాలను పరిశీలించి, వైద్యులు, … Read more

సంక్రాంతి వేళ కన్నీటి విషాదం: కాలిబూడిదైన గిరిజన తండా..

మన పత్రిక వెబ్​డెస్క్, కాకినాడ: సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు ఊరు ఊరంతా కాలిబూడిదైంది. ఈ ఘటనలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి … Read more