Arogya sri services bandh in telangana : తెలంగాణలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ మంగళవారం అర్ధరాత్రి నుండి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హాస్పిటల్ యాజమాన్యాలు తమకు రావాల్సిన 1400 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించకపోవడమే ఈ నిర్ణయానికి కారణం.
ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 323 ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి తాజాగా 100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ నిర్ణయంతో లక్షలాది మంది పేదల ఆరోగ్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. సేవలు నిలిపివేతపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
