Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రేపు వర్షాలు పడే అవకాశం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.

తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుముల సమయంలో బయట తిరిగే వారు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Advertisement
Advertisement