Advertisement

AP: లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

మన పత్రిక, రాజకీయం: అమరావతి పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. మార్చి 28న కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సభలో హామీ ఇచ్చారని తెలిపారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అమరావతికి తమ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఈ బిల్లుపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా మాట్లాడనున్నారు.

Advertisement
Advertisement