మన పత్రిక, వెబ్డెస్క్
ప్రస్తుతం నెల 1–15 మధ్య ఉదయం 8–12, సాయంత్రం 4–8 గంటలకు రేషన్ పంపిణీ జరుగుతుంది. కొన్ని డీలర్లు సమయానికి తెరవడం లేదని, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోజంతా (సుమారు 12 గంటలు) రేషన్ షాపులు ఓపెన్ ఉంచాలని నిర్ణయం.
ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రారంభించనున్నారు. ప్రతి నగరంలో 15 చొప్పున మొత్తం 75 రేషన్ షాపులను ఎంపిక చేస్తారు.
ఈ షాపులను “మినీ మాల్స్” ( AP Mini Malls ) గా మార్చనున్నారు. ఇక్కడ రేషన్ వస్తువులతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. NACTAR, గిరిజన కార్పొరేషన్ ద్వారా సరుకులు సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
సరుకులను ప్రభుత్వమే కొంటుందా లేదా డీలర్లే కొంటారా? రేషన్ కార్డుదారులకు రాయితీ ఉంటుందా? లేదా మార్కెట్ ధరలకే అమ్ముతారా? – ఇంకా స్పష్టత రావాలి.ఈ వారంలోపే షాపుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
