మన పత్రిక: AP Polytechnic Hall Ticket Release 2026 | ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET – 2026) హాల్ టికెట్లు ఈరోజు (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీ (శనివారం) ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్ polycetap.ap.gov.in ద్వారా లేదా ఏపీ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సర్వీస్ ద్వారా తమ హాల్ టికెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి వెల్లడించారు. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని, ముందే డౌన్లోడ్ చేసుకుని వివరాలు సరిచూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
