Advertisement

ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడు లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము నేరుగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ముఖ్యంగా వృద్ధులు, వితంతువుల అభ్యర్థనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విడత ద్వారా దాదాపు లక్షా యాభై వేల మందికి లబ్ధి చేకూరనుంది.

Advertisement

అర్హత ఉన్నవారు సమీపంలోని గ్రామ సచివాలయాలను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డును తీసుకెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పింఛన్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆరు అంచెల పరిశీలన విధానాన్ని అమలు చేస్తోంది. నిజమైన పేదలకు మాత్రమే లబ్ధి అందేలా, అనర్హులను తొలగించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement