కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు: ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేదు.. త్వరలో ఆన్లైన్లోనే!
మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: రాష్ట్రంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటివరకు 6.07 లక్షల పుస్తకాలను రైతులకు అందజేసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మంగళవారం జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. పాస్ పుస్తకాల్లో ఎలాంటి తప్పులు ఉండకూడదని, ట్యాంపరింగ్ కు ఆస్కారం లేని విధంగా వీటిని రూపొందించామని స్పష్టం చేశారు.
‘మీ భూమి-మీ హక్కు’ నినాదంతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని, భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు నేరుగా ఆన్లైన్లో పాస్ పుస్తకాలు పొందేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త పుస్తకాలపై రాజముద్ర, క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
