మన పత్రిక, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ అస్త్రం (AP Astram) మొబైల్ యాప్ను విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలో నిర్వహించిన ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఆధునీకరించాలని సీఎం సూచించారు. పోలీసుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ, రతన్ టాటా హబ్ మరియు విట్ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- భారత్లో కొత్త మెర్సిడెస్ ఏఎమ్జీ ఈ 53 హైబ్రిడ్ కార్ విడుదల
- ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు: పోలీసు విచారణ ప్రారంభం
- న్యాయవాదుల రక్షణ చట్టం క్రిమినల్ కేసుల విచారణకు అడ్డుకాదు: తెలంగాణ హైకోర్టు
- మంచిర్యాల పాఠశాలలో వికటించిన రాత్రి భోజనం 30 మంది విద్యార్థినులు అస్వస్థత
- తెలంగాణ బంద్ కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
