Advertisement
anand devarakonda new movie takshakudu

Anand Deverakonda : నక్సలైట్‌గా రాబోతున్న ఆనంద్ దేవరకొండ.. ఇదిగో ఫస్ట్ లుక్

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా బేబి. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత ఆనంద్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి.

Advertisement

ఆనంద్ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా డైరెక్టర్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమాలో ఆనంద్ హీరోగా నటిస్తున్నాడు. అదే తక్షకుడు(Takshakudu). ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో ఆనంద్ సరికొత్త పాత్రలో నక్సలైట్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా సోషల్ మీడియాలో మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అంటూ ఈ సినిమాకు ఒక క్యాప్షన్ కూడా పోస్టర్ పై రాసుకొచ్చింది మూవీ యూనిట్. ఇది అత్యాశతో ప్రారంభం కాగా, ప్రతికారం ఫాలో అవుతుంది అంటూ తక్షకుడు ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ పోస్ట్ చేసింది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement