మన పత్రిక, వెబ్‌డెస్క్: పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రత లేని ఈ రోజుల్లో సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికి అద్భుతమైన వ్యాపార అవకాశం ఇది. ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ (Amul) తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో మార్కెటింగ్ కష్టాలు లేకుండానే నెలవారీగా రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాపార వివరాలు:
Advertisement
- పెట్టుబడి: సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పెట్టుబడితో (సెక్యూరిటీ డిపాజిట్, షాప్ రినోవేషన్, పరికరాలతో కలిపి) ప్రారంభించవచ్చు.
- స్థలం: 100 నుంచి 150 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది.
- రకాలు: మీ బడ్జెట్, స్థలాన్ని బట్టి ‘అమూల్ ప్రిఫర్డ్ అవుట్లెట్’ లేదా ‘ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్’ను ఎంచుకోవచ్చు.
- లాభాలు: ఈ ఫ్రాంచైజీకి కంపెనీ ఎలాంటి రాయల్టీ (Royalty) వసూలు చేయదు. పాల ప్యాకెట్లు, ఐస్ క్రీమ్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలపై నేరుగా కమీషన్ ఇస్తుంది. మంచి లొకేషన్ ఎంచుకుంటే చక్కటి ఆదాయం మీ సొంతం.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
