WhatsApp
Advertisement

Amberpet SI : ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్

Amberpet SI : గత కొన్ని రోజుల నుంచి అంబర్ పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తన సర్వీస్ రివాల్వర్ కుదువ పెట్టడం, రికవరీ చేసిన బంగారాన్ని కుదవ పెట్టడం, ఇలా ఆయన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే.. ఆన్ లైన్ బెట్టింగ్ లో భానుప్రకాశ్ దాదాపు గా కోటిన్నర వరకు లాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులను అప్పుగా తెచ్చి ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ డబ్బు మొత్తం పోవడంతో అప్పుగా తెచ్చిన డబ్బును తీర్చేందుకు ఇలా అడ్డదారులు తొక్కినట్టు తెలుస్తోంది.

2018 నుంచి ఆన్ లైన్ బెట్టింగ్ చేయడం భాను ప్రకాశ్ కు అలవాటు అయింది. భాను ప్రకాష్ ది ఏపీలోని రాయచోటి. అంబర్ పేట్ పీఎస్ లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4 తులాల బంగారాన్ని కూడా భాను ప్రకాష్ కుదువ పెట్టాడు. ఆ బంగారం యజమాని అడిగితే కనిపించడం లేదని అబద్దం చెప్పాడు. తనకు ఏపీలో వేరే ఉద్యోగం వచ్చిందని ఎస్ఐ ఉద్యోగానికి రిజైన్ చేసి తనను రిలీవ్ చేయాలని ఉన్నతాధికారులను కోరగా సర్వీస్ రివాల్వర్ డిపాజిట్ చేయాలని చెప్పడంతో అసలు భాగోతం బయటపడింది. కుదువ పెట్టిన బంగారాన్ని కూడా జ్యుయెల్లరీ షాప్ నుంచి పోలీసులు రికవరీ చేసి భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement