Amazon Layoffs : ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవం చాప కింద నీరులా విస్తరిస్తోంది. దాని వల్ల అన్ని రంగాల్లోని మ్యాన్ పవర్ కు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఏఐని ఉపయోగించుకొని వంద మంది చేసే పనిని ఒకరిద్దరితో చేయించుకుంటున్నాయి కంపెనీలు. దాని వల్ల ఉద్యోగుల ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ఏఐ వల్ల ఎక్కువగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రఖ్యాత కంపెనీలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
ఇప్పటికే ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ కూడా 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. 2022 లో అమెజాన్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించి అప్పట్లో వార్తల్లోకెక్కింది. మళ్లీ 2025 లో 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 3,50,000 కాగా, అందులో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఏఐ ప్రభావంతో పాటు కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడం కోసం హెచ్ఆర్ డిపార్ట్ మెంట్, సర్వీస్, మరికొన్ని డిపార్ట్ మెంట్లలో ఈ లేఆఫ్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్స్(ట్విట్టర్), టీసీఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

