Advertisement

Alluarjun : AA22xA6 నుంచి క్రేజీ పోస్టర్.. బర్త్‌డే ట్రీట్‌ కు కౌంట్‌డౌన్ స్టార్ట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Alluarjun) బర్త్‌ డే వేడుకలు స్టార్ట్ అయ్యేలోపే… ఫ్యాన్స్‌కు సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది AA22xA6 మేకర్స్ టీమ్. వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ – అట్లీ (Atlee) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఏ రేంజ్ అంచనాలున్నాయో తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

అల్లు అర్జున్ బర్త్ డే కి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్టు టీం అనౌన్స్ చేసారు. కాసేపటి కిందే మూవీ టీమ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్‌ లో తోడేలును పోలిన ఒక మిస్టీరియస్ హ్యాండ్… వెనకాల చీకటిలో కనిపించే కోట… ఓవరాల్ గా వేరే వరల్డ్ లోకి తీసుకుపోయేటట్టు ఫీల్ ఆ పోస్టర్ లో ఉంది.

Advertisement

ఇక ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే కీలక పాత్రలో కనిపించనుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక రేపు అనగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఉదయం 11 గంటలకు సినిమా టైటిల్‌ అండ్ ఫస్ట్ లుక్ ను అఫిషియల్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

Advertisement