Advertisement

ఖాతాదారులకు అలర్ట్.. నేడు బ్యాంకు సేవలు బంద్

మన పత్రిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య అలర్ట్ జారీ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఇవాళ బ్యాంక్ బ్రాంచ్ సేవలు నిలిపివేయనున్నారు. బ్యాంకులు ఓపెన్‌గా ఉన్నప్పటికీ, ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు. వార్షిక ఖాతాల ముగింపు, లెక్కల సరిపోలిక వంటి కీలక పనులను పూర్తి చేయాల్సి ఉండటంతో సిబ్బంది పూర్తిగా అంతర్గత కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. ఈ కారణంగా నగదు జమ, విత్‌డ్రాయల్ వంటి సేవలు బ్రాంచ్‌లలో అందుబాటులో ఉండవు. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 2న బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. కాగా ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Advertisement