Advertisement

మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా

మన పత్రిక: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిందని అఖిల్ అక్కినేని వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫలితం రావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండో రోజు నుంచే థియేటర్ల సంఖ్య పెంచి, భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో వారు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ సిబ్బంది, టెక్నీషియన్లు, కాస్ట్యూమ్ డిజైనర్ రజిని, కో-డైరెక్టర్ రాంబాబు, ఈపీ ఆనంద్ వంటి పలువురి సహకారం వల్లే ఈ సినిమా సాధ్యమైందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement