Advertisement

సీనియర్ ఆటగాళ్లకు గౌరవం, నమ్మకం ఇవ్వాలి: అజింక్య రహానే

మన పత్రిక: టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం, నమ్మకం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత జట్టు మాజీ టెస్టు వైస్ కెప్టెన్, కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా తాను టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, ఈ సమయంలో భారత జట్టు విదేశాల్లోనే కాకుండా సొంతగడ్డపై కూడా టెస్టు మ్యాచ్‌లలో ఓడిపోవడం చూశానని ఆయన పేర్కొన్నారు.

ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రహానే, టెస్టు క్రికెట్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన మనస్తత్వం ఉన్న ఆటగాళ్లు అవసరమని చెప్పారు. కష్టమైన సెషన్లలో క్రీజులో నిలబడి ఆడగలిగేలా ఆటగాళ్లను తీర్చిదిద్దాలని సూచించారు. సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవంతో పాటు మేనేజ్‌మెంట్ నుంచి నమ్మకం, స్పష్టమైన పాత్రలు, భద్రత లభించినప్పుడే వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరని వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో సీనియర్ల అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Advertisement

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే, భారత జట్టుకు అనేక ప్రాధాన్యత కలిగిన విజయాలను అందించారు. ముఖ్యంగా 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన నాయకత్వంలోనే భారత్ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.

Advertisement