మన పత్రిక: ఒకప్పటి ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయనున్నారు. తెలుగులో హిట్టయిన ‘కోర్ట్’ డ్రామా మూవీ రీమేక్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రశాంత్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మాతృకలో కొత్త నటి శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక డెబ్యూ చేయనుండగా, చెన్నైలో ఈ సినిమాకు ఇటీవల కొబ్బరికాయ కొట్టారు.
1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కాదల్ కోటై (తెలుగులో ప్రేమలేఖ) సినిమాలో అజిత్ సరసన నటించిన దేవయాని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు రాజకుమారన్‌ను పెద్దల అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకున్న ఆమె క్రమేపీ సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం చిన్న పాత్రలు, టీవీ సీరియల్స్ చేస్తున్న దేవయాని, తన ఇద్దరు పిల్లల్లో ఒకరైన ప్రియాంకను ఇప్పుడు హీరోయిన్గా పరిచయం చేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
- Infosys Jobs Update : ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్మెంట్.. ఫ్రెషర్స్‌కు ₹21 LPA వరకు ప్యాకేజీ!
- Wipro Walkin Drive : విప్రో వాక్ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌లో టెక్ సపోర్ట్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్!
- అమెరికా డ్రాఫ్ట్‌ను యథాతథంగా ట్వీట్ చేసి బుక్కైన పాక్ ప్రధాని!
- ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
