Advertisement

Bigg Boss 9 : హీటెక్కించిన ఆయేషా.. వచ్చిందిందుకేగా

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో షో మరో మలుపు తిరిగింది. వీళ్ళ ఎంట్రీ తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్లలోనే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా తమిళమ్మాయి ఆయేషా (Aayesha) అదిరిపోయే పాయింట్లతో ఫైర్ అయింది. ఆట సంగతి పక్కన పెడితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో ఆయేషా ఫైర్ ఏంటో ఇట్టే తెలుస్తుంది.

తాజాగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే, నామినేషన్లలో భాగంగా బాల్ తీసుకొని ఆయేషా సుమన్ శెట్టి (Suman Shetty) చేతికి ఇచ్చింది. ఇక సుమన్ ముందుగా సంజనని నామినేట్ చేసి, ఆ తర్వాత రెండో నామినేషన్ గా తనూజ ని సెలక్ట్ చేసాడు సుమన్. దాంట్లో భాగంగా సుమన్… నీ సెంటిమెంట్ మరీ డ్రామాలా ఉంది, అదే తగ్గించాలంటూ అన్నాడు. దానికి తనూజ ప్రతి శుక్రవారం బట్టలు వస్తే చాలు డైనింగ్ మీద ఏడ్చేది మీరు.. అంటూ సెటైర్ వేసింది. దానికి సుమన్ కూడా గట్టిగానే బదులిస్తూ నా కంటే కూడా ఎక్కువ నువ్వెడుస్తున్నావ్ కదా అంటూ కౌంటర్ వేసాడు. అప్పుడు తనూజ మీ నిజ మీ రియల్ ఫేస్ బయటపడింది అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే వీళ్ళలో ఆయేషా సంజనని సేవ్ చేసి తనూజ ని నామినేట్ చేసింది. తనూజ కి అదిరిపోయే కౌంటర్లు వేస్తూ నామినేషన్ ప్రక్రియని హీటెక్కించింది. ఆయేషా తనూజ తో మాట్లాడుతూ “నీ ఇన్‌ఫ్లుయెన్స్, & ఫేవరిజం వల్ల ఇక్కడ మిగతా వాళ్లకు అన్యాయం జరుగుతుంది” అంటూనే ఓపెన్‌ గా చెప్పాలంటే నీ వల్ల “భరణి” గారి గేమ్ కూడా పాడైపోతుందని, స్టార్ మా లో చాలా సీరియల్స్ ఉన్నాయి, నీ సీరియల్ డ్రామా అవసరం లేదు అంటూ ఫైరయింది. చివరగా ఇక్కడో బాయ్ ఫ్రెండో, నాన్నో ఉంటె ఫైనల్ వరకు ఒచ్చేద్దామని ఉందంటూ.. ఇండైరెక్ట్ గా రీతూ కి కూడా కౌంటర్ వేసింది.

Advertisement