టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ -అట్లీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా మొదలై కొన్ని నెలలైనా ఇప్పటి వరకు ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ కూడా రాలేదు. అల్లు అర్జున్ 22వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫైనల్ గా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ (HBD Alluarjun) బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ఒకరోజు ముందే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా #AA22 నుండి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ అయింది.
కాగా అట్లీ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి “రాకా” (Raaka) అనే టైటిల్ ఫిక్స్ చేయగా, విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటూనే ఫాన్స్ కి షాకింగ్ ఫీల్ ఇస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని భయంకరమైన మాస్ బీస్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. మనిషి నుండి ఒక జంతువుగా మారే రేంజ్ లో ‘వేర్-బీస్ట్’ కాన్సెప్ట్‌తో ఈ లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ చేతులు మృగం చేతుల్లా ఉండి, తల వరకు మనిషిలా ఉండి, పూర్తి మొహం చూపించకుండా సస్పెన్స్ లో ఉంచారు. అలాగే నుదుటిపై కొన్ని రోబో చిప్ కు ఉన్నట్టు కొన్ని లైన్స్ కూడా ఉండడంతో షాకింగ్ గా ఉందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.
ఇక తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) మార్క్ మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. కాగా అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అత్యంత ప్రయోగాత్మక చిత్రంగా నిలవనుందని ఫాన్స్ భావిస్తున్నారు. ఇక రాకా మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తుండగా, 2027 సమ్మర్ లో మూవీ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
