మన పత్రిక, హైదరాబాద్: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు (ఏప్రిల్ 18 నుంచి 23 వరకు) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్లో స్పష్టం చేసింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అకస్మాత్తుగా గాలులు వీచి వర్షం పడే సూచనలు ఉన్నాయని, రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్లు, పాత భవనాల కింద ఉండొద్దని హెచ్చరించారు.
వర్ష సూచన ఉన్న జిల్లాలు (తేదీల వారీగా)
| తేదీ | ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు |
| ఏప్రిల్ 18 | జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. |
| ఏప్రిల్ 19 | ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. |
| ఏప్రిల్ 20 | ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. |
| ఏప్రిల్ 21 | ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్. |
| ఏప్రిల్ 23 | ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. |

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
