CDFD Recruitment Junior Assistant 2025 – సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD), హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-II మరియు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి.
ఇందులో స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II పోస్టుకు కేవలం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) అర్హత సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్-II కు 12వ తరగతి అవసరం.
వేతనం: ₹18,000 నుండి ₹35,400 వరకు.
దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులకు లేదు. ఇతరులు ₹200 చెల్లించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2025
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ: 10 అక్టోబర్ 2025
అభ్యర్థులు www.cdfd.org.in లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసి, సంతకం చేసిన ప్రింట్ అవుట్ మరియు సర్టిఫికెట్లతో పాటు పోస్ట్ ద్వారా పంపాలి.
హెడ్-అడ్మినిస్ట్రేషన్,
సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్,
ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ – 500039, తెలంగాణ
CDFD 2025 APPLY ONLINE
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
