Advertisement

Sagility Walk in Drive : సాజిలిటీ వాక్‌ ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. 3 LPA వరకు జీతం!

సాజిలిటీ (Sagility) ఇండియా సంస్థ హైదరాబాద్‌ లో ఫ్రెషర్స్ కోసం భారీ వాక్‌ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జరిగే ఈ డ్రైవ్‌ లో International Voice Process Executive పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 12వ తరగతి పూర్తిచేసినవారు లేదా గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశానికి అర్హులు.

ఈ జాబ్ US హెల్త్‌కేర్ ప్రాసెస్‌ కు సంబంధించినది. పూర్తిగా నాన్-సేల్స్ కస్టమర్ సపోర్ట్ రోల్ కావడంతో, కస్టమర్లకు సహాయం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. కాల్స్ ద్వారా సమస్యలను పరిష్కరించి, మంచి సర్వీస్ అందించాలి.

Advertisement

ఈ ఉద్యోగంలో నైట్ షిఫ్ట్స్ (US టైమ్ జోన్స్) లో పని చేయాలి. ప్రత్యేకంగా రెండు వైపులా క్యాబ్ సౌకర్యం కూడా అందిస్తున్నారు. అలాగే స్థిరమైన జీతంతో పాటు కెరీర్ గ్రోత్ అవకాశాలు కూడా ఉంటాయి.

పర్ ఆనం ₹3 లక్షల వరకు జీతం వస్తుంది. అర్హత విషయానికి వస్తే.. అభ్యర్థులు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఎలాంటి చదువు కొనసాగించకూడదు. BE/B.Tech గ్రాడ్యుయేట్స్ ఈ డ్రైవ్‌కు అర్హులు కారు. హైదరాబాద్‌ లో ఉన్నవారు లేదా వెంటనే రీలొకేట్ అవ్వగలిగిన వారు అప్లై చేయవచ్చు. ఇంటర్నేషనల్ BPO ఫీల్డ్‌ లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.

ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు కింది లింక్ ఉపయోగించి అప్లై చేసుకోవచ్చు.

Check Here: https://tinyurl.com/4edvpsx5

Advertisement