మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ముందుగానే వెలువడనున్నాయి. సాధారణంగా మే నెలలో వచ్చే ఈ రిజల్ట్స్, ఏప్రిల్ 20 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాబోయే రోజుల్లో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలనే ప్రణాళికల నేపథ్యంలోనే బోర్డు ఈసారి మూల్యాంకన వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.
విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ ఐడీ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్లు results.nic.in, cbse.nic.in ద్వారా మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్, ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు నూతన విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో త్రిభాషా సూత్రం, తొమ్మిదో తరగతికి ఏఐ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ పలు కీలక మార్పులు ప్రకటించింది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కేసులో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
- ఎల్నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికలు
- జులై 22 రాశి ఫలాలు: బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు
- తిరుమల భక్తులకు ముఖ్య గమనిక, సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం
- స్పిరిట్ సినిమాలో కొత్త తరహా నటనతో ఆకట్టుకోనున్న ప్రభాస్
