మన పత్రిక: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరణకు లోనవుతుంటాయి. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో వినియోగదారులపై భారం పెరిగింది. ఏప్రిల్ 1న గ్యాస్ ధరలు తగ్గుతాయనే ఆశతో ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ ఎదురైంది. గృహవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం పెరుగుదల నమోదైంది. సోమవారం (ఏప్రిల్ 6) నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో గృహవసరాల సిలిండర్ ధర రూ.965.00గా ఉంది. వరంగల్లో రూ.984.00గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో రూ.921.00గా ఉండగా, విజయవాడలో రూ.937.50గా ఉంది. గుంటూరులో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతున్న నేపథ్యంలో సమీప కాలంలో ధరలు తగ్గే అవకాశాలపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెలలో ధరల్లో మార్పులు ఉంటాయేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
