మన పత్రిక, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ జైలర్- 2 ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు తలైవా స్వయంగా వెల్లడించారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రజినీకాంత్, “జైలర్ 2” చిత్రీకరణ త్వరలో పూర్తవుతుందని, విడుదల తేదీని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నట్లు సమాచారం. అయితే తాజాగా వస్తున్న టాక్ ప్రకారం ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సీక్వెల్లో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ్ నటుడు సంతానం కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. అయితే వీరి పాత్రలపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతంలో వచ్చిన జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్లో కూడా శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలు కొనసాగనున్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ బాద్షా షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తాజా అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జైలర్ 2లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్..?

Advertisement