Advertisement

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదలకు కసరత్తు

మన పత్రిక : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏతో పాటు ఇతర భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన ఈ బిల్లుల కోసం ఉద్యోగులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, బకాయిల చెల్లింపులపై తగిన కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతానికి రూ.7,059 కోట్ల మేర పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

రాష్ట్రంలో నిధుల లభ్యతను బట్టి ఈ చెల్లింపులు సత్వరమే జరిగేలా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించనుంది.

Advertisement